Site icon Prime9

Health Tips: ఈ ఆరోగ్య నియమాలు పాటించండి.. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి!

heart 2 prime9news

heart 2 prime9news

Health: ప్రస్తుతం 30 ఏళ్ల వయసులోనే గుండె పోటు, గుండె జబ్బులు వస్తున్నాయి.గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటే మీ దరికి ఏ రోగాలు చేరకుండా ఉంటాయి. అలా చేయాలంటే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ నియమాలు పాటిస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే.

1.కొందరు పని మీద ధ్యాస పెట్టి ఆహారాన్ని సమయానికి తీసుకోకుండా ఉంటారు. ఇలాంటి వారికి ఎక్కువుగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ముందు ఆహారాన్ని సరయిన సమయంలో తీసుకోవాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు.

2. కొంతమంది ఏవి పడితే అవి తినేసి తర్వాత బాధ పడతారు. అలాగే కొలెస్ట్రాల్ ఉన్న పదార్థాలను చాలా తగ్గించుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

3.ప్రోటీన్స్ ఉన్న పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీకు రోగ నిరోధక శక్తి పెరిగి మీ గుండె తీరు మెరుగుపడుతుంది. మనకి ప్రోటీన్స్ ఉన్న పౌడర్స్ కూడా బయట దొరుకుతాయి. మీరు పాలలో వేసుకొని తాగిన కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది.

4.మాంసహరాలకు దూరంగా ఉండండి.మసాలా పదార్థాలు తగలడం వలన అనేక ఇబ్బందులు వస్తాయి. అప్పుడు గుండె పని తీరులో కూడా మార్పులు వస్తాయి. మాంస ప్రియులు తినే విధానాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే గుండె జబ్బులు రావడం ఖాయం.

5. చాలామంది బయట జంక్ ఫుడ్స్ కు అలవాటపడతారు. అలా తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని పూర్తిగా మానేస్తే మంచిది.

Exit mobile version