Site icon Prime9

Heart Attack: యువకులకే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా..?

heart attack

heart attack

Heart Attack: వయసు మళ్లిన వారికి మాత్రమే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని చాలా మంది భ్రమిస్తుంటారు. కానీ ఇటీవలే గుండె పోటుతో మరణించిన సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్, రాజు శ్రీవాస్తవ, బ్రహ్మ స్వరూప్ మిశ్రా వంటి ప్రముఖులు దాన్ని అవాస్తవమని నిరూపించారు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద 12 లక్షల మందికి పైగ యువత గుండె జబ్బుతో మృతి చెందుతున్నారు. గతేడాది నుంచి దాని ప్రభావం మరింత పెరుగుతూ వస్తోంది. మరి గుండె జబ్బులు యువతలో రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం

భారతీయులే ఎక్కువ..

కరోనా మానవుని జీవన విధానంపై చాలా మార్పుని కనపరిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా చెప్పాలి అంటే కోవిడ్ ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇక ఉద్యోగుల సంగతైతే చెప్పనవసరం లేదు. కరోనా కాలం నుంచి ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడి సమయం పాడు లేకుండా ఆహారపు అలవాట్లు, శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం వంటి చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటలూ నిత్యం కంప్యూటర్ ల్యాప్ టాప్లు పట్టుకుని పనిలో పడిపోవడం వల్ల అది మీ ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీస్తుందో తెలుసా, సరే కొంత మంది శరీరాన్ని దృఢంగా ఉంచినా వర్క్ స్ట్రెస్ వల్ల మానసిక ప్రశాంతత లేకుండా ఉంటున్నారు. ఇలాంటి పలు రకాల కారణాల వల్లే హృద్రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి గుండెజబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందామా

ప్రతీ 5 మందిలో ఒకరికి..

ఆఫీసుకు చేసే ప్రయాణం కూడా వ్యాయామంలో భాగమేనని వైద్యులు తెలుపుతున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయులే సగటున పది సంవత్సరాలు ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారని కామినేని హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాగర్ భూయార్ తెలిపారు.
గుండెపోటుకు గురువుతున్న వారిలో చాలామంది మధ్యవయస్కులే కావడం విషాదం. వాస్తవానికి 20 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులలో ప్రతి 5 మందిలో ఒకరు గుండె జబ్బులతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. గుండె జబ్బులకు అనేక కారణాలున్నాయి. అయితే వీటిలో కొన్నింటిని మనం నియంత్రించలేము. మరికొన్ని హృదయ సంబంధ రోగాలను నియంత్రించగలిగే అవకాశాలున్నాయని డా. సాగర్ అన్నారు. గుండె జబ్బులకు ప్రధాన కారకాలు ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ అని వాటిని నియంత్రణలో ఉంచడం వల్ల చాలా రోగాలను మన దరిచేరకుండా ఉంచవచ్చని ఆయన వెల్లడించారు.
రక్తపోటును నియంత్రించుకోవటం, శరీరపు బరువును అదుపులో ఉంచుకోవటం, పొగతాగటానికి దూరంగా ఉండటం, కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా జాగ్రత్తపడటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆందోళనలు-వత్తిడికి లోనుకాకుండా చూసుకోవటం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చని డాక్టర్ సాగర్ భూయార్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ 5 పోషకాలను తీసుకుంటే చాలు రక్తకణాలు పెరుగుతాయి..

Exit mobile version