Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజే.. 9,629 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారితో 29 మంది మృతి చెందారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. ఇప్పటినుంచే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి.. (Covid Cases)
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజే.. 9,629 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారితో 29 మంది మృతి చెందారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. ఇప్పటినుంచే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
దేశప్రజల్లో మరోసారి ఆందోళన మెుదలవుతోంది. రోజురోజుకు కరోనా వైరస్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్క రోజే.. తాజాగా 9,629 కేసులు నమోదు అయ్యాయి. 29 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.
కరోనా ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఇప్పుడిప్పడు ఊపీరి తీసుకుంటున్నారు. కానీ కరోనా మరోసారి ప్రతాపాన్ని చూపుతోంది.
నేను అంతరించిపోలేదు అన్నట్లుగా మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. మొదట్లో 1000 లోపు నమోదైన కేసులు..గణనీయంగా పెరుగుతూ భయపెడుతున్నాయి.
ఇటీవల 10 వేలు దాటుతూ రెండు మూడు రోజులు కేసులు పెరిగాయి. మధ్యలో కాస్త తగ్గిన తాజాగా మరోసారి 10వేలకు చేరువగా కేసులు పెరుగుతు పోతున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 9,629 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ తో చికిత్స పొందుతూ 29మంది మరణించారు. మంగళవారంతో పోలిస్తే.. 44శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 61,013 కు చేరింది.
తాజాగా కేసులతో కలిపి.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదయ్యాయి.
కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య.. 5.31లక్షలకు చేరుకుంది. రోజువారి పాజిటివిటీ రేటు 5.38 శాతం, వారపు సానుకూలత రేటు 5.61శాతంగా నమోదైంది.
క్రియాశీలక కేసుల సంఖ్య 61, 031కి చేరుకోగా, రికవరీ రేటు 98.68శాతంగా నమోదైంది.
మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను అందించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ ఉధృతికొనసాగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 1,095 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.