Site icon Prime9

Tomatoes: ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ “టమాటాలకు బదులుగా” ఇవి వాడండి..

foods to replacement of tomatoes in cooking

foods to replacement of tomatoes in cooking

Tomatoes: దాదాపు అన్ని భారతీయ వంటల్లో టమటా కావాల్సిందే. కూరలు, గ్రేవీలు ఇలా ఏది వండాలన్నా టమాటా లేకుండా వండడం కష్టం అవుతుందని కొందరు వాపోతున్నారు. టమాటా లేనిదే రుచి రాదు. కానీ పెరిగిన టమాటాల వల్ల దాని వాడకం గురించి సామాన్యుల నుంచి పెద్ద పెద్ద ఆహార వ్యాపారుల వరకు కాస్త ఆలోచించాల్సి వస్తోంది. టమాటా ధరలు చూస్తేనేమో డబులు సెంచరీకి దగ్గరగా కొన్ని నగరాల్లో అయితే ట్రిపుల్ సెంచరీకి దగ్గరగా ఉంటాయి. ఇలా టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో కూరల్లో వాటికి బదులుగా ఏం వాడొచ్చు.. వాటికి ప్రత్యామ్నాయాలు ఏంటా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో టమాటాలకు బదులుగా ఈ పదార్థాలను వాటి చూడండి రుచిలోనూ కాస్త మార్పు వస్తుంది. ఇదో టేస్ట్ అంటూ మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు అంటున్నారు కొందరు ఆహార నిపుణులు.

పెరుగు

మొదట్లో టమాటాలే లేవంట.. వాటిని మన దేశంలో 16 వశతాబ్దంలో పోర్చుగీసు వాళ్లు పరిచయం చేశారని చరిత్ర చెప్తుంది. అంతకముందు కూరల్లో పులుపు కోసం పెరుగు వాడేవారు. అసలు టమాటా మనం దేశంలోకి రాకముందు భారతీయ వంటల్లో పెరుగునే ఎక్కువగా వాడేవారట. ఇప్పుడు కూడా టమాటాకు బదులుగా వంటల్లో కూడా పులుపు కోసంపెరుగు వాడి చూడొచ్చు.

చింతపండు గుజ్జు

టమాటాకు బదులు చింతపండు గుజ్జు వాడొచ్చని పలువురు చెఫ్ లు సలహా ఇచ్చారు. ఏవైనా సాసులు, చట్నీలు చేస్తున్నపుడు చింతపండు వాడొచ్చు. అలాగే దాదాపు పులుపు ఉండే చాలా సాంప్రదాయ వంటల్లో చింతపండునే వాడి వంటలు చేసుకోవచ్చు.

ఆమ్ చూర్ పొడి

అలాగే కూరల్లో పులుపు కోసం ఆమ్ చూర్ పొడి, పులుపుగా ఉండే చుక్క కూర లాంటి ఆకుల పొడిని వాడి వంటలు చేసుకోవచ్చని మరికొందరు చెప్తున్నారు. అంతే కాకుండా వంగమామిడి ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు లాంటి వాటిని కూరల్లో చేర్చుకోవచ్చు. ఇవన్నీ పులుపుతో పాటూ కూర రుచిని కూడా పెంచుతాయి.

Exit mobile version