Site icon Prime9

Health Tips For winter: చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులకు చక్కటి చిట్కాలు

best-tips-for-relief arthritis-joint-pain-in-winter-season

best-tips-for-relief arthritis-joint-pain-in-winter-season

Health Tips For winter: చలికాలంలో సాధారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి. వణికించే చలి కారణంగా కీళ్లు, మోకాళ్లు, ఎముకలలో ఎక్కువ నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఈ నొప్పులు బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అలాంటప్పుడు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడం వల్ల సగం సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ శీతాకాలంలో మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, మరికొన్ని థెరపీలు సహాయపడతాయి. అవేంటో చూసేయ్యండి.

నెయ్యి
శీతాకాలంలో మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచడంలో నెయ్యి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ సీజన్‌లో ప్రతిరోజూ నెయ్యి తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది మలబద్ధకం, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.

గుడ్లు
కోడిగుడ్డులోని ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వేడి గుణాలను కలిగి ఉంటాయి. ఈ చలికాలంలో గుడ్లు తినడం ద్వారా మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవచ్చు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే పోషకాలు శరీరాన్ని ఎక్కువ సేపు వెచ్చగా ఉంచుతాయి.

పసుపు పాలు
పసుపులో ఉండే యాంటీ బయాటిక్స్ లక్షణాలు, పాలలోని కాల్షియం శక్తి రెండూ కలిసి ఆర్థరైటిస్ రోగులకు నొప్పుల నుంచి గొప్ప ఉపశమనం కలిగిస్తాయి.
రాత్రి పడుకునే ముందు పాలలో పసుపు కలిపి తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉండడంతో పాటు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్‌లు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరం వెచ్చగా ఉంటుంది.

యోగా ఆసనాలు
శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు యోగా థెరపీ కూడా గొప్పగా పనిచేస్తుంది. ఈ చలికాలంలో ప్రతిరోజూ కొన్ని ప్రత్యేక యోగ ఆసనాలు సాధన చేస్తూ ఉండాలి.
ఇందులో నౌకాసనం, శీర్షాసనం, సేతుబంధాసనం, కుంభకాసనం వంటి ఆసనాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

ఇదీ చదవండి: మలబద్ధకం, అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టే వంటింటి చిట్కాలు

Exit mobile version