Karnataka: సాధారణంగా మనం తినే దోశ ఖరీదు రూ.30 నుంచి రూ.80 వరకూ ఉంటుంది. కానీ కర్ణాటకలోని ఒక హోటల్లో మాత్రం దోశ ఖరీదు ఏకంగా రూ.1001గా నిర్ణయించారు. దీని ప్రత్యేకత ఏమనుకుంటున్నారా? దోశపై బంగారు కాగితాన్న అంటించి కస్టమర్లకు సర్వ్ చేస్తారు. అందువల్లే దీని ఖరీదును ఆ విధంగా నిర్ణయించారు.
కర్ణాటక తుముకూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ భోజనాలయంలో ఈ దోశ లభిస్తుంది. మరి ఇంత ఖరీదైన దోశ కు కస్టమర్లు ఉన్నారా అంటే ఉన్నారని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. రోజుకు మూడు దోశలు వరకూ అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు. ప్రజల జీవనప్రమాణాలు బాగా పెరిగాయి కాబట్టి ఈ రేంజ్ ఆహారపదార్దాలకు కస్టమర్లు కూడ పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు.