Samantha In Ram Charan and Sukumar Movie?: క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్టర్‌గా రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘రంగస్థలం’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 2018లో వచ్చిన ఈ చిత్రంతో చరణ్ తన నటనతో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. చిట్టిబాబుగా చేసిన ఈ పాత్ర చరణ్‌ను నటనలో మరో మెట్టు ఎక్కించింది. రామ్ చరణ్, సమంత జంటకు కూడా మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. మొత్తానికి సుకుమార్, రామ్‌చరణ్, సమంత కాంబో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే కాంబో మళ్లీ రిపీట్ కానుందని తెలుస్తోంది.
RC16తో బిజీ
ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత చరణ్ మరోసారి సుకుమార్‌ని లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తన 17వ చిత్రాన్ని సుకుమార్‌తోనే చేస్తున్నాడు గట్టి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చరణ్‌కి స్టోరీ కూడా చెప్పడాట. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉంది సుకుమార్ అండ్ టీం. అయితే ఇందులో హీరోయిన్‌గా సమంత పేరు పరిశీలిస్తున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సమంతకు తెలుగులో ఒక్క సినిమా లేదు.
చివరిగా ఖుషిలో
ఇటీవల మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సామ్ సినిమాలు చేయడం తగ్గించి వ్యాపారం వైపు అడుగులు వెస్తోంది. ఇప్పటికే సొంతంగా ఓప్రొడక్షన్ హౌజ్ స్థాపించింది. మరోవైపు ఓ క్రికెట్ టీంని కొనుగోలు చేసింది. ఇప్పటికే వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. మరోవైపు పలు బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్స్ చేస్తోంది. ఇలా సినిమాల కంటే కూడా ప్రమోషన్స్, సొంత వ్యాపారాలతో బిజీ అయిపోయింది. ఆమె తీరు చూస్తుంటే ప్రస్తుతం తెలుగుపై పెద్దగా ఫోకస్డ్‌గా లేనట్టే కనిపిస్తోంది. చివరిగా విజయ్ దేవరకొండ ‘ఖుషి’లో కనిపించింది. ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతుంది. అప్పటి సామ్ తెలుగులో మరో ప్రాజెక్ట్ ఒకే చేయలేదు. దీంతో ఆమె రీఎంట్రీ కోసం తెలుగు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సుకుమార్, చరణ్ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తే మాత్రం ఫ్యాన్స్‌కి ఇది పండగలాంటి వార్తే అవుతుంది.
సమంత? రష్మిక?
ఇక సుకుమార్ అడిగితే సమంత నో అనే ఛాన్స్ లేదు. మొన్నటి దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో తెలుగులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తన మనసులో మాట చెప్పింది. కాబట్టి, సుకుమార్ అండ్ టీం ఫిక్స్ అయ్యి సమంత సంప్రదిస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్‌తో ఆమె రీఎంట్రీ కన్‌ఫాం అయినట్టే. అయితే, సమంత తర్వాత మరో ఆప్షన్ రష్మిక మందన్నా పేరు కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు. ప్రస్తుతం అయితే సుకుమార్ మాత్రం ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్‌పై ఫుల్ ఫోకస్డ్‌గా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ సినిమా హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే ఫిక్స్ అవుతారని సినీవర్గాల నుంచి సమాచారం. RC16 మూవీ ఈ ఏడాది అక్టోబర్ లోగా ఫూర్తయితే మాత్రం వచ్చే ఏడాది జనవరిలో RC17 సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేయిట్ చేయాల్సిందే.