Actress Sherlyn Chopra:నటి షెర్లిన్ చోప్రా బోల్డ్ గా చేసే కామెంట్లతో తరచుగా మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ మాజీ ‘బిగ్ బాస్ 13’ కంటెస్టెంట్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వివాహం చేసుకోవడాన్ని పరిశీలిస్తారా అని సరదాగా అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.
పెళ్లయ్యాక..(Actress Sherlyn Chopra)
తాజాగా కొంతమంది అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న షెర్లిన్ చోప్రాను ఒక ఫోటోగ్రాఫర్ రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటారా అని సరదాగా ప్రశ్నించాడు. దీనికి షెర్లిన్ యొక్క ప్రతిస్పందన ఇలా ఉంది. అవును. ఎందుకు చేసుకోకూడదు. కానీ పెళ్లయ్యాక నా ఇంటిపేరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చింది. గత నెలలో, ఆమె జుహు పోలీస్ స్టేషన్‌లో ముంబైకి చెందిన ఫైనాన్షియర్‌పై వేధింపుల కేసు నమోదు చేయడం ద్వారా వార్తల్లో కెక్కింది. వీడియో రికార్డింగ్ కోసం డబ్బు ఇస్తాననే నెపంతో ఫైనాన్షియర్ తనను వేధించాడని, అతని అడ్వాన్స్‌లను తాను వ్యతిరేకించినప్పుడు బెదిరింపులు మరియు మాటలతో దుర్భాషలాడాడని షెర్లిన్ ఆరోపించింది. అంతేకాకుండా, ‘బిగ్ బాస్ 16’లో సాజిద్ ఖాన్ పాల్గొనడంపై ఆరోపణలు చేసి MeToo కి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
మరోవైపు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా తిరిగి నియమించబడ్డారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ అతని సభ్వత్వాన్ని పునరుద్దరించింది. దీనితో రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్ కు హాజరయ్యారు.