Site icon Prime9

Gangs Of Godavari : పోస్టుపోన్ అయిన ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ .. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ..

vishwak-sen-gangs-of-godavari-movie-postponed

vishwak-sen-gangs-of-godavari-movie-postponed

Gangs Of Godavari: యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హిట్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం.. లేటెస్ట్ గా వచ్చిన “దాస్ కా దమ్కీ” సినిమాలతో సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నాడు. కాగా VS11 సినిమాని చల్ మోహన్ రంగ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో రాబోతుంది. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో విశ్వక్ సరికొత్త లుక్ లో కనిపించబోతుండడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. అయితే ఈ సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ” అనే టైటిల్ తో రానుంది. ఇది ఇలా ఉంటే అభిమానులు షాక్ అయ్యే వార్త ఒకటి బయటపడింది .

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ డిసెంబర్ 8న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ చిత్రం పోస్టుపోన్ అవ్వబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ ఈ వాయిదా గురించి ఇన్‌డైరెక్ట్‌ గా మాట్లాడుతూ చేసిన ఓ పోస్టు నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ పోస్టులో విశ్వక్.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న కచ్చితంగా తీసుకోని వస్తానంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ మూవీ వాయిదాని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీని 2024 మార్చి 8న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విశ్వక్ సేన్ అభిమానులను ఈ వార్త నిరాశపరిచింది. అయితే ఆడియన్స్ నిరాశపడతారు అని తెలిసి వారి  కోసం ఈ మూవీ (Gangs Of Godavari)లో విశ్వక్ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పి మేకర్స్ ఫ్యాన్స్ ని కొంచం ఖుషీ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ చాలా గ్రే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారట. ఈ పాత్ర విశ్వక్ కెరీర్ గుర్తుండిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. చీకటి ప్రపంచంలో ఒక సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథను రాజకీయ కోణంలో ఊరమాస్ గా చూపించబోతున్నారట. నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంటే, మరో నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘సుట్టంలా సూసి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవల ఈ మూవీ సెట్స్ లో విశ్వక్ కి చిన్న ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రమాదం అవ్వలేదని సమాచారం. కాగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి .

 

Exit mobile version