Site icon Prime9

Vaishnavi Chaitanya : బేబీ సక్సెస్ తర్వాత మొదటి దీపావళి.. తమ్ముడితో గ్రాండ్ సెలెబ్రేషన్ ..

vishnavi chaitanya diwali special pics

vishnavi chaitanya diwali special pics

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య బేబీ మూవీ తో హీరోయిన్ గా మారి పెద్ధ హిట్ కొట్టి ఎందరినో అభిమానులను గెలుచుకుంది . షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటనకి, అందానికి అంతా ఫిదా అయ్యారు. సిరీస్ లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడం తో సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అల్లు అర్జున్, నాని, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వైష్ణవి చైతన్య నటించి మెప్పించింది.

తెలుగమ్మాయి అవ్వడంతో పాటు బాగా నటించడంతో వైష్ణవికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే బేబీ సినిమాతో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఈ ముద్ధు గుమ్మ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటించిన ‘బేబీ’ సినిమా భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే . హిట్ సాధించడమే కాక ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో వైష్ణవి హీరోయిన్ గా మొదటి సినిమాతోనే స్టార్ అయిపొయింది.ఇక ఈ సినిమా తర్వాత వైష్ణవి ఇప్పుడు ఫుల్ బిజీ అయింది. హీరోయిన్ గా మూడు సినిమాల్లో నటిస్తుంది. ఇక హీరోయిన్ అయి, బేబీ సక్సెస్ తర్వాత మొదటి దీపావళి రావడంతో తన తమ్ముడితో కలిసి ఇంటివద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పట్టుచీరలో, దీపావళి టపాసుల వెలుగుల్లో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది వైష్ణవి.

హీరోయిన్ అయిన తరువాత వైష్ణవి మూవీస్ బిజీగా వుండడం వల్ల సోషల్ మీడియాలో పోస్ట్ లు తగ్గించిది . కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ఫెస్టివల్ అవ్వడం వల్ల దీవాళి కి పట్టు చీరలో ప్రేక్షకులను మెప్పించిది. తన కుటుంభ సభ్యులతో ఎంతో సంతోషంగా దీవాళిని సెలెబ్రేట్ చేసుకుంటుంది

Exit mobile version