Site icon Prime9

Megastar Chiranjeevi : మెగాస్టార్ ఇంట ఘనంగా వినాయకచవితి వేడుకలు.. ఈసారి స్పెషల్ గా “క్లిన్ కారా”

vinayaka chavithi celebrations at megastar chiranjeevi house

vinayaka chavithi celebrations at megastar chiranjeevi house

Megastar Chiranjeevi : వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితిని పురస్కరించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ప్రతిమను పూజగదిలో ప్రతిష్టించి చిరంజీవి, సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, శ్రీజా, సుష్మితా తో పాటు పిల్లలు ఉన్నారు. కాగా ఈ వేడుకల్లో  క్లీన్ కారా కూడా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ మేరకు మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పొస్ట్ లో.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి మా ఇంట్లో ప్రత్యేకత… చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం ఆనందంగా ఉంది అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరంజీవి కుటుంబ సభ్యులంతా ఓకే చోట కనిపించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటు చిరంజీవి కూడా వరుసగా సినిమాలు ఓకే చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు.

 

Exit mobile version