Site icon Prime9

Vikram Veda Trailer: అదుర్స్ అనిపిస్తున్న విక్రమ్ వేద ట్రైలర్

Vikram veda trailer prime9 news

Vikram veda trailer prime9 news

Bollywood: బాలీవుడ్ బడా హీరోలు హృతిక్ రోష‌న్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ “విక్ర‌మ్ వేద”. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్రబృందం విక్రమ్ వేద ట్రైల‌ర్‌ను విడుదల చేశారు. విడుదలైన కొద్ది సమయంలోనే ఈ ట్రైల‌ర్ విప‌రీతమైన ప్రేక్షకాదరణను పొందింది.

హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా, సైఫ్ ఆలీఖాన్ పోలీస్ ఆఫిస‌ర్‌గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. ఈ మూవీలో సైఫ్ కు జోడీగా రాధికా ఆప్టే నటించింది. ఈ సినిమాలోని సైఫ్ మరియు హృతిక్ మధ్య రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులను కళ్లు తిప్పుకోకుండా చేస్తాయనే చెప్పుకోవచ్చు.

త‌మిళనాట హిట్టందుకున్న విక్ర‌మ్ వేద చిత్రానికి రీమేక్‌గా తీసిన ఈ సినిమాను రిల‌య‌న్స్ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, టీ సిరిస్ ఫిలింస్‌, ఫ్రైడే ఫిలిం వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మించగా, పుష్క‌ర్‌–గాయ‌త్రి దర్శకత్వం వహించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన వాల్ పోస్టర్లు, టీజ‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలను పెంచుతున్నాయి. మరి ఇది ఏ మేరకు కలెక్షన్లు కొల్లగొడుతుందో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

Exit mobile version