Site icon Prime9

Liger First day collections: లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్

liger prime9news

liger prime9news

Tollywood: లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు వరకు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా పై ఉన్న అంచనాల వలన 4 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక సినిమా రిలీజ్ ఐనా తరువాత ఓవరాల్ గా చూసుకుంటే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు కలిపి, అన్ని చోట్లా యావరేజ్ గా 60% నుంచి 65% రేంజ్ లో ఆక్యుపెన్సీతో రన్ అయింది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షో లు చూసుకుంటే ప్లేట్ తిప్పేసింది . బుక్ చేసుకున్న టికెట్స్ కూడా హోల్డ్ లో నే చూపించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో లైజర్ సినిమా మీడియం రేంజ్లో కలెక్షన్స్ సాధించింది . ఇప్పుడు ఉన్న హీరోలందరూ సినిమాకు మంచి టాక్ వస్తే ఫస్ట్ డేనే మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సినిమా దుమ్ము దుమారం లేపడానికి సిద్ధం అవుతున్నారు. లైగర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ క్రింద విధంగా కలెక్షన్స్ సాధించాయి .

లైగర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్

కేరళ : 0.25 కోట్లు గ్రాస్

తమిళనాడు : 0.25 కోట్లు గ్రాస్

కర్ణాటక +రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.25 కోట్లు గ్రాస్

హిందీ : 1.25 కోట్లు గ్రాస్

ఏపీ / తెలంగాణ : 15.5 కోట్లు గ్రాస్

ఆల్ ఇండియా : 18.5 కోట్లు గ్రాస్

ఓవర్శిస్ : 9.6 కోట్లు గ్రాస్

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ కలెక్షన్స్ – రూ 28.10 కోట్లు

Exit mobile version