Site icon Prime9

Vijay devarakonda: రిపోర్టుకు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన లైగర్ విజయ్ దేవరకొండ

Tollywood: విజ‌య్ దేవ‌ర‌కొండ మామూలుగానే కోపం చాలా ఎక్కువ‌. విజయ్ కు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంటుందని ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే యూత్‌కు విజయ్ దేవరకొండ బాగా కనెక్ట్ అయ్యాడు. అతను అలా బాగా క‌నెక్ట్ అయ్యడంటే అతనకు ఉన్న ఆటిట్యూడ్ వల్లే అని అన‌టంలో ఎలాంటి సందేహం పడాలిసిన్ అవసరం లేదు. త‌న ఎగ్రెసివ్‌నెస్ చూసి ఆయ‌న్ని అంద‌రు ముద్దుగా రౌడీ స్టార్ అని పిలుచుకుంటారు. విజ‌య్‌ని ఇబ్బంది పెట్టేలా ఏదైనా ప్ర‌శ్న ఎదురైతే, త‌న నుంచి వ‌చ్చే రిప్ల‌య్ కూడా అంతే ఘాటుగా ఉంటుంది. ఇది ఒకసారి జరిగింది కూడా, విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్‌గా న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఆగ‌స్ట్ 25 తారీఖున రిలీజ్‌కి రెడీ అయింది. అంద‌రూ సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా యూనిట్ అంతా కొంచం కూడా గ్యాప్ లేకుండా ప్ర‌మోష‌న్స్‌లో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు.

ఇదే క్ర‌మంలో ముంబైలో ఓ విలేఖ‌రి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ విసుక్కునే ప్రశ్న అడిగాడు. ఒక వేళ లైగ‌ర్ సినిమా ప్లాప్ అయితే మీ పరిస్థితేంటి అని ప్ర‌శ్నించాడు. దాంతో చుట్టు ఉన్న‌వారంద‌రూ టెన్ష‌న్ ప‌డ్డారు. విజ‌య్ ఎలాంటి రియాక్ట్ అవుతాడోన‌ని అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. విజ‌య్ దేవ‌ర‌కొండ రియాక్ట్ అయిన తీరు అక్క‌డున్న వారిని షాక్ అయ్యేలా చేసింది. ప్ర‌శ్న విన్న రౌడీ బాయ్ కూల్‌గా స‌మాధానం ఇచ్చాడు. మీరు వేసిన ప్రశ్నకు నాకు కోపం రావడం లేదు. ఒక‌ప్పుడు ఇదే ప్ర‌శ్న నాకు వేసుంటే నాకు బాగా కోపం వ‌చ్చుండేదేమో. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం నేను దేశం మొత్తం తిరిగాను. అభిమానుల‌ను క‌లుసుకున్నాను. వారు చూపించిన ప్రేమాభిమానాల‌ను ఎప్పటికి మ‌ర‌చిపోలేను. నాకు ప్రేక్ష‌కులు, అభిమానులు చాలా ముఖ్యం. వాళ్ళ కోసం సినిమాలు చేస్తూనే ఉంటాను. వారి అభిమానాన్ని గెలుచుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాను ఆయన సమాధానమిచ్చారు.

విజయ్ దేవరకొండ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘లైగర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగ‌స్ట్ 25 న అంటే రేపు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. బాక్సింగ్ లెెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించి సినిమాకు మరింత క్రేజ్ను తెచ్చిపెట్టారు. రమ్యకృష్ణ ఇందులో హీరో మ‌ద‌ర్ పాత్రలో న‌టించారు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాకు నిర్మాతలుగా ఛార్మి, క‌ర‌ణ్ జోహార్‌, అజ‌య్ మెహ‌తా క‌లిసి ఈ ముగ్గురు సినిమాను నిర్మించారు.

Exit mobile version