Site icon Prime9

Liger Movie: ఓటీటీలో “లైగర్” వచ్చేసింది

liger now streaming on disney+hot star

liger now streaming on disney+hot star

Liger Movie: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. కాగా ఈ సినిమా విడుదలయిన ముప్పై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. దానితో విజయ్ దేవరకొండ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది.

భారీ హైప్ మధ్య విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఫస్ట్ షో నుండే లైగర్ ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా రెండో రోజు నుంచే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. భారీ ధరకు లైగర్ హక్కులు దక్కించుకున్న బయ్యర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. అయితే ఇటీవలె లైగర్ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో లైగర్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చెయ్యగా అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. కాగా మాజీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా ఓ ప్రత్యేక రోల్ చేశారు.

ఇదీ చదవండి: National Cinema Day: సినీ అభిమానులకు శుభవార్త… రూ. 75కే సినిమా చూడొచ్చు

Exit mobile version