Site icon Prime9

Saindhav Movie : సైకోగా విక్టరీ వెంకటేష్.. “సైంధవ్” మూవీ టీజర్ రిలీజ్ !

victory venkatesh saindhav movie teaser released

victory venkatesh saindhav movie teaser released

Saindhav Movie : విక్టరీ వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ “సైంధవ్”. ఇటీవలే హిట్ వంటి థ్రిల్లర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతుంది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళ్ నటుడు ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు కూడా నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ చిత్రం. కాగా ముందుగా ఇక ఈ సినిమాని డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ అవుతుండడంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెంకీ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఇక ఈ టీజర్ లో గమనిస్తే..  వెంకటేష్, భార్య, కూతురుతో సంతోషంగా ఉండడం.. మరోవైపు ఒక గ్యాంగ్ ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడం వంటివి చూపించారు. ఇక యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

 

 

Exit mobile version