Site icon Prime9

Sankranthiki Vastunam: చివరి దశకు చేరుకున్న వెంకిమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ – అరకులో ఫైనల్‌ షెడ్యూల్‌

Sankranthiki Vasthunnam Movie Final Schedule Begains in Araku: విక్టరి వెంకటేష్‌ హీరోగా హిట్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 చిత్రాలు మంచి విజయం సాధిచింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనింగ్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టున్నాయి ఈ సినిమాలు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో హ్యట్రిక్‌ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం రూపొందింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది.  షూటింగ్‌ సెట్స్‌లోని వీడియోలు కూడా షేర్‌ చేస్తు అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా మూవీ టీం మరో సరికొత్త అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ లోకేషన్‌ ఎక్కడో చెబుతూ వెంకిమామ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ అందించింది టీం. మూవీ చివరి షెడ్యూల్‌ మొదలైంది.

“సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్‌ షెడ్యూల్‌ ఈరోజే అరకులో మొదలైంది” అంటూ ఓ స్పెషల్‌ వీడియో షేర్ చేశారు మేకర్స్‌. ఇందులో వెంకిమామకు స్కూల్‌ పిల్లలు పూలు జల్లుతూ గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పడం ఆకట్టుకుంది. క్రైం థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని ఇప్పటికే దర్శకుడు అనిల్‌ రావిపూడి హింట్‌ ఇచ్చాడు. అంతేకాదు ఇందులో ట్రాయాంగిల్‌ లవ్‌స్టోరీ కూడా ఉంటుందని, ఇది ఆడియన్స్‌కి మంచి వినోదం అందిస్తుందని సినీవర్గాలు తెలిపాయి.

కాగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్‌, సాయి కుమార్‌, నరేష్‌, వీటీ గణేష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌లో చెప్పినట్టే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

Exit mobile version