Site icon Prime9

Matka OTT: 3 వారాల్లోనే ఓటీటీకి వస్తున్న మట్కా – అధికారిక ప్రకటన వచ్చేసింది

Varun Tej Matka OTT Release Date: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మట్కా’. నవంబర్‌ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టేలేదు. ఓ మాదరి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు థియటర్లో కనీస ఆక్యూపెన్సీ కూడా లేదు. ఫలితంగా మట్కా ఫస్ట్‌డే డే ఘోరమైన రివ్యూస్‌తో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలని విభిన్న కథతో వచ్చిన వరుణ్‌ తేజ్‌కి ఈ సినిమా నిరాశ పరిచింది.

అయితే ఇప్పుడు మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని అమెజాన్‌ ప్రైం సొంతం చేసుకుంది. థియేటర్‌లో పెద్దగా ఆదరణ రాకపోవడంతో మట్కాను మూడు వారాల్లోనే ఓటీటీకి తీసుకువస్తున్నారు. వచ్చే నెల డిసెంబర్‌ 5 నుంచి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అమెజాన్‌ ప్రైం అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్‌ మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. కాగా వరుణ్‌ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌ నటించిన మట్కాను యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.

ఈ సినిమా కరుణా కుమార్‌ దర్శకత్వం వహించాడు. గ్యాంబ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్, ఎమోషనల్‌ సీన్స్‌ పెద్దగా వర్కౌట్‌ కాలేదంటున్నారు. కనీసం మిడియం రేంజ్‌ సినిమా కంటే దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అసలు కథ, కథనం ఆడియన్స్‌ని ఆకట్టుకోకపోవడంతో థియేటర్లో విడుదలైన తొలి వారంలోనే మట్కా వెనుదిరిగింది. దీంతో నిర్మాతాలు భారీ నష్టాలను చూశారు. అనాముకుడైన ఓ కుర్రాడు శరణార్థిగా వచ్చి మట్కా కింగ్‌ ఎలా ఎదిగాడు? దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా ఏం చేశాడు? అనేదే ఈ కథ. రియల్ మట్కా గేమ్‌ ఆధారం కల్పిత పాత్రతో ఈ సినిమాను తీశాడు కరుణాకర్‌.

Exit mobile version