Varun Tej – Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కాగా ఈ మేరకు వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరవ్వగా.. అల్లు అర్జున్ మిస్ అయినట్లు కనబడుతుంది. పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ హాజరు కాలేదని సమాచారం అందుతుంది. ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈ వివాహం జరగుంది. అయితే పెళ్లి తేదీ పైనే క్లారిటీ రావాల్సి ఉంది. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహం జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మెగా కుటుంబం ఈ పెళ్లి తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి త్వరలో జరగబోతుంది. ఇక ఈ పెళ్లి వేడుక సంబరాలు ఆల్రెడీ మొదలయ్యి సందడి సందడిగా జరుగుతున్నాయి. నిశ్చితార్థం వేడుకను పూర్తి చేసుకున్న ఈ మెగా జంట.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల చిరంజీవి ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ పార్టీలో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్.. ఇలా పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా హాజరయ్యారు. మెగావారి ఇంట జరిగిన ఆ సెలబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీ నుంచి.. శిరీష్, బన్నీ వారసుడు అయాన్ మాత్రమే హాజరయ్యినట్లు ఫోటోలు చూస్తే అర్ధమయ్యింది. అయితే తాజాగా అల్లువారి ఇంట మరో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి.
ఈ పార్టీలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన వారంతా కనిపిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ కూడా హాజరయ్యారు. హీరో నితిన్, హీరోయిన్ రీతూ వర్మ.. తదితరులు అటెండ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను అల్లు శిరీష్ షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ పెళ్లి పనులు అన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.
A party at home with family & friends celebrating Varun & Lavanya’s upcoming wedding! pic.twitter.com/QiQlrCw8uH
— Allu Sirish (@AlluSirish) October 16, 2023