Site icon Prime9

Varun Tej – Lavanya Tripathi : వైభవంగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా !

Varun Tej – Lavanya Tripathi pre wedding photos goes viral

Varun Tej – Lavanya Tripathi pre wedding photos goes viral

Varun Tej – Lavanya Tripathi : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. గత కొంత కాలంగా  ప్రేమ లో ఉన్న మెగా హీరో వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇటీవల ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కాగా ఈ మేరకు వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ తాజాగా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరవ్వగా.. అల్లు అర్జున్ మిస్ అయినట్లు కనబడుతుంది.  పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ హాజరు కాలేదని సమాచారం అందుతుంది.

అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల మధ్య ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుండగా.. పలువురు ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లి తమ పెళ్లి బట్టలు కూడా డిజైనింగ్ కి ఆర్డర్ ఇచ్చారని టాక్ నడుస్తుంది.

 

 

Exit mobile version