Varun Tej – Lavanya Tripathi Marriage : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. మెగా, అల్లు, కామినేని కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి వేడుకలలో ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను పెళ్లిలో వరుణ్, లావణ్య ధరించారు. ఈ నెల 5న హైదరాబాద్లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో రిసెప్షన్ జరగనుంది.
ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. 2017లో మిస్టర్ సినిమాలో కలిసి నటించారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అంతరిక్షం సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకులేకపోయింది. దాదాపు ఆరు సంవత్సరాలు ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. ఇక ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వేడుకల్లో భాగంగా వారిని ఆశీర్వదిస్తూ ఒక ఫోటోని షేర్ చేశారు. ఆ పిక్ లో మెగా హీరోలు అందరూ కలిసి ఉండడం అందర్నీ ఖుషి చేస్తుంది. అలానే ఆ జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.