Site icon Prime9

Varun Tej – Lavanya Tripathi Engagement : వైభవంగా వరుణ్ – లావణ్య నిశ్చితార్ధం.. వైరల్ గా మారిన పిక్స్

Varun Tej - Lavanya Tripathi Engagement photos goes viral

Varun Tej - Lavanya Tripathi Engagement photos goes viral

Varun Tej – Lavanya Tripathi Engagement : గత కొంత కాలంగా  మెగా హీరో వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుండగా.. పలువురు ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వచ్చి సందడి చేశారు.

ఈ మేరకు వరుణ్ తేజ్ లావణ్యతో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి నా లవ్ దొరికింది అంటూ స్పెషల్ గా పోస్ట్ చేశాడు. దీంతో వీరి నిశ్చితార్థం (Varun Tej – Lavanya Tripathi Engagement) ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే వీరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

లావణ్య-వరుణ్ జంటగా మిస్టర్ మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ 2017 లో విడుదలైంది. ఆ సినిమా సెట్స్ లోనే వీరికి పరిచయం ఏర్పడింది. మొదట అది స్నేహంగా మారింది. తర్వాత ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’లో మరోసారి వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటి నుంచి ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని భావిస్తున్నారు. వరుణ్ తేజ్ (Varun Tej – Lavanya Tripathi Engagement) సోదరి నిహారికా కొణిదెల‌ వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న “గాండీవధారి అర్జున” చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version