Site icon Prime9

Varun Lavanya : వరుణ్ ఇంట్లో లావణ్య దీవాళి సెలెబ్రేషన్స్ .. వైరల్ గా మారిన పిక్స్ ..

varun-lavanya first diwali celebrations

varun-lavanya first diwali celebrations

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫొటోలు వస్తే వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈ జంట ఫోటోస్ వైరల్ గా మారాయి. అయితే వీరి ప్రేమ పెళ్ళి వరకు ఎలా దారి తీసింది అంటే వీరు మొదట మిస్టర్ మూవీలో  జంటగా చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ 2017 లో విడుదలైంది. ఆ సినిమా సెట్స్ లోనే వీరికి పరిచయం ఏర్పడింది.

మొదట అది స్నేహంగా మారింది. తర్వాత ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’లో మరోసారి వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటి నుంచి ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్ళి అనే బంధం అనే తో ఒక్కటయ్యారు . అయితే వీరి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట.ప్రస్తుతం ఈ ఫెస్టివల్ పిక్స్ వైరల్ అయ్యాయి .

పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ ఇంట్లో లావణ్య అత్తామామలు, నిహారిక, భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ అంతా సరదాగా క్రాకర్స్ కాల్చారు. ఇంట్లో అందంగా పూలతో ముగ్గులు వేసి ఫోటోలు దిగారు. కుటుంబ సభ్యులతో సంప్రదాయం గా ఈ పండుగ జరుపుకుంటూ వున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా, అభిమానులకు హ్యాపీ దీవాళి అంటూ పోస్ట్ చేయగా అభిమానులు కూడా హ్యాపీ దీపావళి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే వరుణ్, లావణ్య దీపావళి స్పెషల్ ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి.ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న “గాండీవధారి అర్జున” చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

 

Exit mobile version