Urvashi Rautela Cryptic Post on Game Changer: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ మూవీ హిట్‌తో ఈ భామ తెగ మురిసిపోతుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్య్వూలో ఇస్తుంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మధ్య ఊర్వశి రౌతేలా తరచూ ఏదోక వివాదంలో నిలుస్తోంది. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ పంత్‌తో వివాదంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఇక రీసెంట్‌గా సైఫ్ అలీఖాన్ దాడి ఘటనపై చేసిన కామంట్స్ తీవ్ర దుమారం రేపడంతో ఆమె క్షమాపణలు చెప్పింది.
తాజాగా గేమ్ ఛేంజర్‌పై రిజల్ట్‌పై ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రామ్ చరణ్ నటన, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికి కథ, కథనం బలహీనంగా ఉందని, రోటిన్ స్టోరీలా అనిపించిందన్నారు. ఇందులో ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగ పండలేదనే టాక్ వచ్చింది. దీంతో మూవీకి ఆడియన్స్ ఆదరణ కరువైంది.
ఫలితంగా గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇది నిజమే అయినప్పటికీ ఆమె వ్యవహరించిర తీరు మెగా అభిమానులకు కోపం తెప్పించేలా ఉంది. ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊర్వశి మాట్లాడుతూ.. “కియార అద్వానీ నటించిన సినిమా గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది, కానీ నేను నటించి డాకు మహారాజ్ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నా తప్పు ఏముంది. అయితే ఈ విషయంలో ఊర్వశి బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అది మీకు కూడా తెలుసు కదా” అంటూ గర్వానికి పోయింది.
Kiara's #GameChanger is a disaster and my film #DaakuMaharaaj is a blockbuster.
– @UrvashiRautela pic.twitter.com/ieKUHB9UIP— Telugu Chitraalu (@TeluguChitraalu) January 19, 2025
ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక కియారా ఫ్యాన్స్ అయితే ఊర్వశీని ఏకిపారేస్తున్నారు. ఒక సినిమా హిట్‌కే ఇంత పొగరు ఊపిస్తున్నావని, కియార ఓ స్టార్ హీరోయిన్, ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె కామెంట్స్ తర్వాత గేమ్ ఛేంజర్ ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ చేసింది. సినిమా బాగా లేకపోయినా పెయిడ్ పీఆర్‌లు సోషల్ మీడియా ప్రచారం చేసుకున్నా జనాలు వాటిని తిప్పికొడతారంది. దీంతో ఆమె కామెంట్స్ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు ఆమెపై విమర్శలు గుప్పిస్తూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.