Site icon Prime9

SSMB 28 : అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. “ఎస్‌ఎస్‌ఎంబీ 28 ” టీమ్

update from mahesh babu ssmb 28 movie

update from mahesh babu ssmb 28 movie

SSMB 28 : సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. `ఎస్‌ఎస్‌ఎంబీ28` అనే వర్కింగ్ టైటిల్ తో.. రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్‌  దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మహేష్‌ ఊరమాస్‌ లుక్‌ అదిరిపోయింది. ఇందులో మహేష్‌ని ఊర మాస్ గా చూపించబోతున్నారని టాక్ నడుస్తుంది.

కాగా ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న మహేష్‌-త్రివిక్రమ్‌ ల సినిమా టైటిల్‌ ని రివీల్‌ చేస్తామని వెల్లడించింది. తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ యూనిట్‌. అదే రోజు `మాస్‌ స్ట్రైక్‌` పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ గ్లింప్స్ తరహాలోనే ఓ థండర్‌ లాంటి వీడియోని రిలీజ్‌ చేయబోతున్నారు. ఇది యాక్షన్‌ సన్నివేశాలతో ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.

ఇక ఈ పోస్టర్ లో మహేష్‌ బ్యాక్‌ సైడ్‌ నుంచి తలకు రెడ్‌ టవల్‌ కట్టుకుని, చేతితో సిగరేట్‌ తాగుతూ, చెక్స్ షర్ట్ లో, రగ్గుడ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో మహేష్‌ లుక్‌ ఊరమాస్‌గా ఉండటం విశేషం. ఈ సినిమాకి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా టైటిల్‌ని ఏకంగా ఫ్యాన్స్ చేతనే రివీల్‌ చేయించబోతున్నారు. థియేటర్ల లోనే ఈ సినిమా టైటిల్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. కృష్ణ ఎవర్‌ గ్రీన్‌ మూవీ `మోసగాళ్లకి మోసగాడు` మూవీ ప్రదర్శించే థియేటర్లలో ఈ పని చేయబోతుండడం విశేషం అని చెప్పాలి.

 

అలాగే మూవీలో హీరోయిన్స్ పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారని వెల్లడించారు. మేము ప్రకటించకుండానే సెకండ్ హీరోయిన్ గా ‘శ్రీలీల’ని తీసుకున్నట్లు. మళ్ళీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఏవి నిజం కాదు. ఈ సినిమా కోసం శ్రీలీలని తీసుకున్న సంగతి నిజమే కానీ ఆమె సెకండ్ హీరోయిన్ అనేది అబద్ధం అని ఈ మూవీలో ఇద్దరి హీరోయిన్ లకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని ఇటీవల మూవీ నిర్మాత నాగ వంశీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version