Prime9

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో సందడి చేయనున్న సినిమాలు / వెబ్ సిరీస్ లు ఏవంటే..!

Upcoming Releases : ఈ వేసవిలో ఎక్కువగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. అయితే ఈసారి జూన్‌ మొదటి వారంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి పెద్ద సినిమా బరిలో దిగనుంది.  మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు (Upcoming Releases) ..

“ఆదిపురుష్‌”.. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ఆదిపురుష్“. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. హిందూ ఇతిహాసంలోని రాముడి కథతో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై ఆసక్తిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. మరోవైపు ‘జై శ్రీరామ్‌’ పాట యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.

Adipurush (Prabhas, Kriti Sanon, Sunny SIngh)

 

ది ఫ్లాష్‌..

డీసీ కామిక్స్‌ ఫాలో అయ్యే వాళ్లకు ‘ఫ్లాష్‌’ క్యారెక్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిల్లర్‌ కీలక పాత్రలో ఆండీ మూషియాటీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది ఫ్లాష్‌’. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. జూన్‌ 15న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. డీసీ సిరీస్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

The Flash" exibido pela 1ª vez: reações apontam para filme histórico; veja  trailer

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్‌..

అడైమగై కాలం (తమిళం) జూన్‌ 11

ఎక్స్‌ట్రాక్షన్‌ 2 (హాలీవుడ్) జూన్‌ 16

అమెజాన్‌ ప్రైమ్‌..

జీ కర్దా (హిందీ) జూన్‌ 15

రావణకొట్టం (తమిళం) జూన్‌ 16

డిస్నీ+హాట్‌స్టార్‌..

ఫుల్‌ కౌంట్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 14

షెవలియర్‌ (హాలీవుడ్‌) జూన్‌ 16

బిచ్చగాడు2 (తమిళం) జూన్‌ 17

సైతాన్‌ (తెలుగు సిరీస్‌) జూన్‌ 15

జియో సినిమా..

రఫూచక్కర్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 15

ఐ లవ్‌ యూ (హిందీ చిత్రం)జూన్‌ 16

ఈటీవీ విన్‌..

కనులు తెరిచినా కనులు మూసినా (తెలుగు) జూన్‌ 16

సోనీలివ్‌..

ఫర్హానా (తమిళ చిత్రం) జూన్‌ 16

లయన్స్‌ గేట్‌ప్లే..

డెస్పరేట్‌ రైడర్స్‌ (హాలీవుడ్) జూన్‌ 16

మనోరమా మ్యాక్స్‌..

వామనన్‌ (మలయాళం) జూన్‌ 16

Exit mobile version
Skip to toolbar