Site icon Prime9

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు..

upcoming releases of movies and web series details

upcoming releases of movies and web series details

Upcoming Releases : సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో మే మొదటి వారంలో థియేటర్‌లో వినోదాల విందు సిద్ధమైంది. మరోవైపు ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

రామబాణం.. 

శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్‌ చేస్తున్న చిత్రం “రామబాణం”. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్‌ హయాతి కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, ఖుష్బూ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. గోపీచంద్‌, డింపుల్‌ హయాతీ మధ్య కెమిస్ట్రీ, ఈ జంట స్టైలిష్‌ అవతారం ప్రేక్షకుల్ని మరింతగా మెప్పించనుంది. శ్రీవాస్ – గోపీచంద్‌ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అంతకు ముందు వచ్చిన లక్ష్యం, శౌర్యం మంచి హిట్లుగా నిలిచాయి.

ఉగ్రం.. 

తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అల్లరి నరేష్. కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు నాట విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతూ వచ్చాడు. ఈ తరుణంలోనే తన పంథాను మార్చి నాంది సినిమాతో మంచి హిట్ కైవసం చేసుకున్నారు. దాని తర్వాత ఆ సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి మళ్ళీ ఇప్పుడు ఉగ్రం మూవీ తో రాబోతున్నాడు. మిర్నా కథా నాయికగా షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కిడ్నాప్, మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

అరంగేట్రం.. 

రోషన్‌.జెడ్‌, ముస్తఫా ఆస్కరి, శ్రీనివాస్‌, అనిరుధ్‌, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్‌ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరంగేట్రం’. శ్రీనివాస్‌ ప్రభన్‌ దర్శకుడు. మహేశ్వరి నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘అరంగేట్రం’ మూవీని తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.

యాద్గిరి అండ్‌ సన్స్‌.. 

వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాద్గిరి అండ్‌ సన్స్‌. అనిరుధ్‌ తుకుంట్ల, యశ్విని నివేదిత, జీవా, రాజీవ్‌ కనకాల, మధుమణి, మురళీధర్‌గౌడ్‌, రోహిత్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న థియేటర్‌లలో విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌..

మీటర్‌ (తెలుగు) మే 5

3 (తెలుగు) మే 5

అమృతం చందమామలో (తెలుగు) మే 5

యోగి (తెలుగు) మే5

రౌడీ ఫెలో (తెలుగు) మే 5

తమ్ముడు (తెలుగు) మే 5

తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ) మే 5

క్లిఫర్డ్‌: ది బిగ్‌ రెడ్‌ డాగ్‌ (ఇంగ్లీష్‌) మే 2

ది టేర్‌ (ఇంగ్లీష్‌) మే 2

క్వీన్‌ షార్లెట్‌: ఏ బ్రిడ్జిర్టన్‌ స్టోరీ (వెబ్‌సిరీస్‌) మే 4

శాంక్చురీ (మూవీ) మే 4

ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్‌) మే 4

డిస్నీ+హాట్‌స్టార్‌.. 

కరోనా పేపర్స్‌ (మలయాళ చిత్రం ) మే 5

సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో (హిందీ) మే 5

జీ 5.. 

ఫైర్‌ ఫ్లైస్‌ (హిందీ సిరీస్‌) మే 5

షెభాష్‌ ఫెలూద (బెంగాలీ)మే 5

ఈటీవీ విన్‌.. 

మ్యాచ్‌ ఫిక్సింగ్‌(తెలుగు) మే 5

Exit mobile version