Site icon Prime9

Jani Master: ఆ రోజు మీ నిజస్వరూపం బయటపడుతుంది – జానీ మాస్టర్‌ సంచలన ట్వీట్‌

Jani Master Sensational Tweet: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ లైంగిక వేధింపు కేసులో అరెస్ట్‌ అయ్యి జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో ఉంది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్‌పై తరచూ ఏదోక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాను అమాయకుడని ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదిక స్పందిస్తూ వాటిని ఖండిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓ షాకింగ్‌ ట్వీట్‌ చేశాడు. ఎవరిని ఉద్దేశించి ఈ జానీ మాస్టర్‌ ఈ కామెంట్స్‌ చేశాడనేది క్లారిటీ లేదు. కానీ తన కేసులో కోర్డు అర్డర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్న కొందరిని చూస్తుంటే జాలేస్తుందంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం జానీ మాస్టర్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

జానీ మాస్టర్‌ ట్వీట్‌
“కొందరు తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని చూస్తుంటే జాలేస్తుంది. నాకు తెలియకుండా జరిగిన ముందస్తు యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికలపై నేను పెట్టిన కేసుకి సంబంధించిన వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా,నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో. కానీ, అసుల తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికి అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే యాంకర్‌, వాయిస్ ఆఫ్ ఉమెన్‌ సభ్యురాలు ఝాన్సీ చేసిన ఓ పోస్ట్‌ తర్వాత జానీ మాస్టర్‌ ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం.

ఝాన్సీ ఏమన్నదంటే
“ఫిలిం ఛాంబ‌ర్ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ కొరియోగ్రాఫ‌ర్ జానీ కోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా దీనిని విచారనించిన కోర్టు జానీ భాషా పిటీష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఫిలిం ఛాంబ‌ర్ గెలిచింది. ప‌ని చేసే చోట మ‌హిళ‌ల‌ భ‌ద్ర‌తకు ప్రాధాన్య‌త‌ ఉంటుంద‌ని ఈ తీర్పు ద్వారా మ‌రోసారి రుజువైంది. ధ‌ర్మం వైపు నిల‌బ‌డి న్యాయ‌పోరాటం చేసేందుకు స‌హ‌కారం అందించిన ఫిల్మ్ ఛాంబ‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు” అంటూ ఝూన్సీ తన పోస్టులో రాసుకొచ్చిది. ఆమె పెట్టిన ఈ పోస్టు తర్వాత జానీ మాస్టర్‌ ఈ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఝాన్సీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని అంతా అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version