2022 మోస్ట్ ఓవర్ రేటెడ్ సినిమా ఏది… తెలుగు,తమిళ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ ‘వార్’?

లెట్స్ సినిమా అనే సంస్థ ట్విట్టర్ వేదికగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా ఏది అని ఒక పోస్ట్ పెట్టారు. ఇందుకు గాను కొందరు కాంతారా, కేజీఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్, విక్రమ్, ఆర్ఆర్ఆర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - December 17, 2022 / 02:03 PM IST

Over Rated Cinema 2022: ఇటీవల గూగుల్, ఐఎండీబీ భారతదేశంలో రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 10 సినిమాలను ప్రకటించారు. ఈ సంవత్సరం అధికంగా గూగుల్ లో ఈ సినిమాల కోసం సెర్చ్ చేశారని గూగుల్ ఒక జాబితాను రిలీజ్ చేసింది.

వాటిలో… 

1. బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ
2. కేజీఎఫ్ చాప్టర్ 2
3. కాశ్మీర్ ఫైల్స్
4. ఆర్ఆర్ఆర్
5. కాంతారా
6. పుష్ప: ది రైజ్
7. విక్రమ్
8. లాల్ సింగ్ చద్దా
9. దృశ్యం 2
10. థోర్: లవ్ అండ్ థండర్

అలానే ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో

1. ఆర్ఆర్ఆర్
2. కాశ్మీర్ ఫైల్స్
3. కేజీఎఫ్ : చాప్టర్ 2
4. విక్రమ్
5. కాంతారా
6. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్
7. మేజర్
8. సీతా రామం
9. పొన్నియిన్ సెల్వన్: మొదటి భాగం
10. 777 చార్లీ

అయితే ఇప్పుడు ఈ ర్యాంకుల వల్లే ఇప్పుడు కొత్తగా ఓ వివాదం రాజుకుంది. గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమ ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకొని బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. బాహుబలి తో ప్రారంభం అయిన ఈ పరంపర తాజాగా వచ్చిన కార్తికేయ 2 వరకు కొనసాగుతూనే ఉంది. త్వరలోనే మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు సైతం ప్రేక్షకులను అలరించనున్నాయి. అయితే మరోవైపు కన్నడ పరిశ్రమ కూడా కేజీఎఫ్, కేజీఎఫ్ 2 , కాంతారా సినిమాలతో మంచి పేరు పొందింది. తమిళంలో కూడా విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాలు ఇండస్ట్రి హిట్లుగా నిలిచాయి. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రి సినిమాల హవా నడుస్తుంది అని అనిపిస్తుంది.

కానీ తాజాగా లెట్స్ సినిమా అనే సంస్థ ట్విట్టర్ వేదికగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా ఏది అని ఒక పోస్ట్ పెట్టారు. ఇందుకు గాను కొందరు కాంతారా, కేజీఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్, విక్రమ్, ఆర్ఆర్ఆర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీంతో మన తెలుగు వాళ్ళు కూడా తగ్గేదె లే అంటూ వరుస పోస్ట్ లతో ట్విట్టర్ వేదికగా రచ్చ లేపుతున్నారు. ముఖ్యంగా తమిళ తంబీలు తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్ ను టార్గెట్ చేస్తుండడం పట్ల మన వాళ్ళు కూడా వారి వారి స్టైల్లో కామెంట్లు చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇటీవల మన తెలుగు నిర్మాత దిల్ రాజు తమిళ హీరోలైన విజయ్, అజిత్ గురించి చేసిన కామెంట్లు తమిళనాట ఎంతటి వివాదానికి దారి తీశాయో అందరికి తెలిసిందే. దీంతో కావాలనే వారంతా తెలుగు సినిమాను టార్గెట్ చేస్తున్నారని అంతా భావిస్తున్నారు.

ఇక రికార్డుల పరంగా చూసుకున్నప్పటికి ఆర్ఆర్ఆర్ ను ఆ విషయంలో టచ్ చేయలేరని చెప్పాలి. కేవలం ఇండియా లోనే కాకుండా జపాన్, యూకే, యూఎస్ఏ లో కూడా దుమ్ము రేపే కలెక్షన్లతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక అలానే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం పొంది ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇక పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాలు ఇండస్ట్రి హిట్ లు నిలిచాయి తప్ప దేశవ్యాప్తంగా ఆ రేంజ్ క్రేజ్ ని అయితే పొందలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సోషల్ మీడియా వార్ కి బ్రేక్ ఎప్పుడు పడుతుందో అని…