Site icon Prime9

Yatra-2: ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటూ.. “యాత్ర 2” మోషన్ పోస్టర్ రిలీజ్

Yatra-2: 2019లో ఎన్నికల సమయంలో మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించిన “యాత్ర” సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. డైరెక్టర్ మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఇప్పుడు తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథ ఆధారంగా యాత్ర 2 సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కాగా శనివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఒక నిమిషం పాటు ఉన్న ఆ వీడియోలో.. యానిమేటెడ్ జగన్ నడుస్తూ ఉంటే బ్యాగ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.

‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే ..’ అంటూ ఆనాడు వైఎస్ మాట్లాడిన గొంతును మరోసారి ఈ వీడియోలో వినిపించారు డైరెక్టర్. ఇక ఆ తర్వాత.. “నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను నేను ఉన్నాను” అంటూ జగన్ వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా విడుదలైన ఈ మోషన్ పోస్టర్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.

లీకుల బెదడ(Yatra-2)

ఈ సినిమాను V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇందులో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. కాగా ఈ మూవీ జగన్ పాదయాత్ర దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తవుతుందని డైరెక్టర్ గతంలోనే తెలిపారు.

ఇకపోతే ఈ మోషన్ పోస్టర్ గతంలోనే లీక్ అయ్యి సంచలనంగా మారింది. కాగా ఇప్పుడు అదే మోషన్ పోస్టర్ ఎటువంటి మార్పులు చేయకుండా మరల దానినే V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్స్ విడుదల చేశాయి.

Exit mobile version