Site icon Prime9

Nag 100th Movie: నలుగురు దర్శకులకు నాగ్ 100వ సినిమా బాధ్యతలు.. వారెవరంటే..!

Nagarjuna 100th film

Nagarjuna 100th film

Tollywood: కింగ్ నాగార్జున వ‌చ్చే ఏడాది త‌న 100వ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త ఇప్ప‌టికే చిత్రపరిశ్రమలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇది మన్మథుడి కెరీర్‌లో మైల్‌స్టోన్‌లా నిలిచిపోయేలా ఉండాలన్నట్టు నాగ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కాగా ఈ సినిమా చాలా ప్ర‌త్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో ఈ టాలీవుడ్ హీరో చెప్పుకొచ్చాడు.

ఈ స్పెష‌ల్ ప్రాజెక్టు కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉందని, న‌లుగురు డైరెక్టర్లతో ఈ సినిమాకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాని, ఆ న‌లుగురు ద‌ర్శ‌కుల్లో మంచి ఐడియాతో వ‌చ్చిన వ్య‌క్తితో సినిమా ప్ర‌క‌టిస్తాన‌ని అక్కినేని హీరో నాగార్జున తెలిపారు. అయితే ఇటీవ‌ల కాలంలో నాగ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌ను విడిచి రాహుల్ ర‌వీంద్ర‌న్‌, శ్రీరామ్ ఆదిత్య‌, క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల, ప్ర‌వీణ్ స‌త్తారు లాంటి యువ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తున్న సంగ‌తి విధితమే.

మరి రీసెంట్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఆడియెన్స్ అభిరుచికి సరిపోయేలా ఇప్ప‌టి ట్రెండ్‌ను ఫాలో అవుతూ క‌థ‌లు రాయాలంటే యువ ద‌ర్శ‌కుల‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే మ‌రి నాగార్జున త‌న ప్ర‌తిష్మాత్మ‌క సినిమా బాధ్య‌త‌లను ఏ డైరెక్టర్లు అప్పగించాడు. ఇంత‌కీ నాగార్జునను ఇంప్రెస్ చేసే ఆ ద‌ర్శ‌కుడెవ‌ర‌నేది ప్ర‌స్తుతం సస్పెన్స్ గా మారింది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రావొచ్చ‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: సంక్రాంతి బరిలో బాస్… ప్రభాస్ విజయ్ లతో పోటీగా మెగాస్టార్..!

Exit mobile version