Site icon Prime9

NTR30 Movie: #NTR30 లో రాములమ్మ ?

vijayashanti-ntr30

Tollywood: దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం నటీనటులు, సిబ్బంది మరియు షూటింగ్ గురించి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ అనిశ్చితి మధ్య ఫిల్మ్ నగర్ లో ఒక పుకారు షికారు చేస్తోంది.

ఈ సినిమా కోసం లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ తో ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడం వల్ల #NTR30 పై మంచి హైప్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో విజయశాంతికి ఓ పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. తారక్ తర్వాత ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర ఉందని, ఆ స్థానాన్ని విజయశాంతి పర్ఫెక్ట్ గా చేయగలదని దర్శకులు కొరటాల నమ్మకం.కొరటాల ఈ పాత్రను విజయశాంతికి వివరించారని దీనికి ఆమె ఇంప్రెస్ అయ్యారని సమాచారం. అయితే ఈ సినిమాకి ఆమె సంతకం చేసిందా లేదా అనేది క్లారిటీ లేదు. రెండేళ్ళ క్రితం, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు.’ సినిమాతో విజయశాంతి వెండితెరపైకి తిరిగి వచ్చారు. ఆమె #NTR30 లో నటిస్తే ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవడమే కాకుండా అంచనాలు రెట్టింపు అవుతాయి.

#NTR30 అనేది ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం. అయితే రెండు ప్రొడక్షన్ హౌస్‌లు ఈ పుకారు పై ఇంకా స్పందించలేదు.

Exit mobile version