Site icon Prime9

Rashmika Mandanna: రష్మికకు రింగ్ తొడిగిన విజయ్.. నేషనల్ క్రష్ రియాక్షన్ ఏంటంటే..?

Rashmika mandanna

Rashmika mandanna

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక, రౌడీబాయ్ విజయ్ దేవరకొండల గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. అయితే వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడి.. టూర్స్, వెకేషన్స్ అని కలిసి తిరగడం వంటివి చేస్తున్నారు. దానితో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని ప్రేమలో ఉన్నారనే వార్తలు బాగా వచ్చాయి.

ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న రష్మిక(Rashmika Mandanna), విజయ్..!

దీనిపై అధికారికంగా ఇద్దరూ కూడా ఇంతవరకు స్పందించలేదు. అయితే తాజాగా రష్మిక పుట్టిన రోజు నాడు తనకు వచ్చిన విషెష్ కి అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ రష్మిక ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొంతచేపటికి విజయ్ దేవరకొండ ఫొటోను షేర్ చేశారు. దానితో విజయ్ ఫొటోలో ఉన్న ప్లేస్, రష్మిక ఇప్పుడు ఉన్న ప్లేస్ రెండూ ఒకటే అని వారిద్దరూ నిజంగా ఒకే చోట ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా, డేటింగ్ చేస్తున్నారా అని నెటిజన్లు పలువురు పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఓ మీడియా సంస్థ వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని.. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని ఇంక ఇటీవల కాలంలోనే విజయ్ తన ఫేవరెట్ రింగ్ ను రష్మికకు గిఫ్ట్ చేశాడని తెలిపింది. మనం త్వరలోనే వీరి ప్రేమకు సంబంధించిన శుభవార్తను వింటామని నెట్టింట పోస్ట్ చేసింది.

దీనిపై స్పందించిన రష్మిక అయ్యో, మరీ ఓవర్ గా థింక్ చేయకు బాబు అని పోస్ట్ చేసింది. దానితో రష్మిక చేసిన ట్వీట్ కాస్త మరింత వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ తో రష్మిక ఏ పట్టాన ఓ క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా జరుగున్నట్టు తెలుస్తుంది దీనితో మరోసారి అభిమానులు, నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.

Exit mobile version