Site icon Prime9

Allu Arjun: అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

alluri movie prime9news

alluri movie prime9news

Tollywood: ” అల్లూరి” సినిమాతో ప్రేక్షకులను అలరించనున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈ సినిమాకు ప్రదీప్ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను వేపించుకుంది.

సెప్టెంబర్ 18 వ తేదీన అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నారని, ఇక మనం తగ్గేదేలే అంటూ శ్రీవిష్టు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. పోస్టర్ చూసిన బన్నీ అభిమానులు బన్నీని దగ్గర నుంచి చూసేందుకు ఈవెంట్ టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారని తెలిసిన సమాచారం. బన్నీ రాకతో ఈవెంట్ మొత్తం అభిమానులతో నిండిపోతుంది.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు కొత్త అవతారంలో కనిపించనున్నారు, పవర్ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ధుమ్ము దులపనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా శ్రీవిష్ణు కెరియర్లో సూపర్ హిట్ అయి, అతనికి మంచి పేరు రావాలని కోరుకుందాం.

 

Exit mobile version