Site icon Prime9

Up Coming Movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా..!

this week upcoming-movies-in-theater and OTT

this week upcoming-movies-in-theater and OTT

Up Coming Movies: ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. పెద్ద సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెడుతూనే.. చిన్న చిత్రాలు బాగుంటే చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. కాగా ప్రస్తుతం వెండితెరపై చిన్నచిత్రాల హవా కొనసాగుతోంది. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజలను అలరించేందుకు వస్తున్నాయో చూసేద్దాం.

1 మసూద

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం మసూద. ఈ సినిమా థియేటర్లో నవంబర్ 18 ప్రేక్షుకల ముందుకు రానుంది.

2. గాలోడు

‘సుడిగాలి’ సుధీర్‌ హీరోగా ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా రాబోతున్న చిత్రం గాలోడు. ఈ చిత్రంలో గెహన సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్‌, పృథ్వీ తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు. కాగా ఈ సినిమా కూడా నవంబర్ 18 థియేటర్లలో విడుదలై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

3. అలిపిరికి అల్లంత దూరంలో

నూతన తారాగణంతో ఎన్‌.రావన్‌రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి తదితరులు కీలక పాత్రలు పోషించిన మూవీ అలిపిరికి అల్లంత దూరంలో. ఈ సినిమా కూడా నవంబర్ 18వ తేదీని రిలీజ్ కానుంది.

4. సీతారామపురంలో ఒక ప్రేమ జంట

రణధీర్‌, నందినిరెడ్డి హీరోహీరోయిన్ గా సుమన్‌, తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం సీతారామపురంలో ఒక ప్రేమ జంట. ఈ మూవీ కూడా నవంబర్ 18న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

5. దృశ్యం 2 హిందీలో

అజయ్‌దేవ్‌గణ్‌, టబు, అక్షయ్‌ఖన్నా, శ్రియ, ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం దృశ్యం2. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరించేందుకు నవంబర్ 18 రిలీజ్ కానుంది.

ఇకపోతే ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు వెబ్ సిరీస్ లు ఇవే..

రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ హీరోహీరోయిన్లుగా నటిచించిన అహనాపెళ్లంట మూవీ నవంబర్ 17న జీ5 వేదికగా విడుదల కానుంది.


కార్తీ హీరోగా ఇటీవల స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ సర్దార్ ఆహా వేదికగా నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.


చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హాలీవుడ్ మూవీ ది వండర్ నవంబర్ 16న, 1899 (హాలీవుడ్‌) నవంబరు 17, రిటర్న్‌ టు క్రిస్మస్‌ క్రీక్‌ (హాలీవుడ్‌) నవంబరు 17, ఇలైట్‌ (హాలీవుడ్‌) నవంబరు 18, స్లంబర్‌ల్యాండ్‌( హాలీవుడ్‌) నవంబరు 18న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి.


హాస్టల్‌డేజ్‌ సీజన్‌-3 (వెబ్‌సిరీస్‌-హిందీ) నవంబరు 16న, ది సెక్స్‌లైవ్స్‌ ఆఫ్‌ కాలేజ్‌గర్ల్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 18న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇరవతం (తమిళ్‌/తెలుగు) నవంబరు 17, సీతారామం (తమిళ్‌) నవంబరు 18న డిస్నీ హాట్ స్టార్ వేదిగా స్ట్రీమింగ్ కానున్నాయి.

అనల్‌ మీలే పని తులి (తమిళ్‌) నవంబరు 18న, వండర్‌ ఉమెన్‌ (తెలుగు) నవంబరు 18న సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ చిత్రానికి సీక్వెల్ వచ్చేస్తుంది.. రాజమౌళి క్లారిటీ

 

Exit mobile version