Site icon Prime9

Raghavendra Rao: భవిష్యత్‌ అంతా టెక్నాలజీదే- దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

talented-tollywood-director-raghavendra-rao-opening-a-tech-tizing-gravity-add-studio-in-manikonda-hyderabad

talented-tollywood-director-raghavendra-rao-opening-a-tech-tizing-gravity-add-studio-in-manikonda-hyderabad

Raghavendra Rao: హైదరాబాద్ మణికొండలోని ఓయూ కాలనీలో ఏర్పాటు చేసిన టెక్‌-టైజింగ్‌- గ్రావిటీ ఆటమ్స్‌ను ప్రఖ్యాత సినీ దర్శకధీరుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ డిజిటల్‌ రంగంలో యాడ్స్‌ ప్రధానంగా మారాయని, ఎన్ని యాడ్స్‌ పెరిగితే అంత పని కూడా పెరుగుందని, ఇలాంటి తరుణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. క్రియోటివిటీ, టెక్నాలజీ రంగం ఉహించని విధంగా అభివృద్ధి చెందుతుందని రాఘవేందర్ రావు అన్నారు. దానికి తగినట్లుగానే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రావిటీ ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైన యాడ్స్‌ రూపొందించారని, ప్రస్తుతం వారి సేవలకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ తోడైందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ రంగ ఏజెన్సీల పోటీ వ్యాపారంలో అధునాతనమైన గ్రావిటీ అటామ్స్ మెటావర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని స్టూడియో ఎండీ విన్ను ముత్యాల అన్నారు. యాడ్ ఫిల్మ్ మేకింగ్‌లో దశాబ్దానికి పైగా అనుభవంతో మరో పది ఏళ్ల భవిష్యత్‌ను మందుగానే ఊహించి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా పలు యాప్స్‌ వాడంకం అధికంగా పెరిగిందని, ఇలాంటి టెక్నికల్‌ డివైజ్‌లకు అనువైన సాంకేతికతను, వినూత్న ఆవిష్కరణలుగా రూపొందిస్తున్నామని సీఈవో సాయి సుబ్బిరెడ్డి పోతంశెట్టి అన్నారు. క్లయింట్‌లకు సృజనాత్మకతతో కూడిన డిజిటల్‌ సేవలను అందించడంతో పాటు వారి మార్కెటింగ్‌ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి అవసరమైన సహాకారాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు కళ్యాణ్‌ కృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు, టాప్‌మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు.

ఇదీ చదవండి: ఇతడే నా భర్త.. పెళ్లి రూమర్స్ పై తమన్నా స్ట్రాంగ్ కౌంటర్

Exit mobile version
Skip to toolbar