Site icon Prime9

Gaalodu: “గాలోడు” విజయం ప్రతీ ఒక్కరిది- సుడిగాలి సుధీర్

sudigaali-sudheer-gaalodu-movie-success-meet-in-hyderabad

sudigaali-sudheer-gaalodu-movie-success-meet-in-hyderabad

Gaalodu: సుడిగాలి సుధీర్‍ హీరోగా న‌టించిన ప‌క్కా మాస్ అండ్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన `గాలోడు` సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మించింది. ఈ సినిమా నవంబర్ 18న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. గాలోడు సినిమా మంచి విజయం సాధించడంతో మంగళవారం నాడు ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ సెలెబ్రేషన్స్ లో తమ్మారెడ్డి భరద్వాజ, హీరో హీరోయిన్లు అయిన సుధీర్, గెహ్నా, ఇంద్రజ, దర్శక, నిర్మాత అయిన రాజశేఖర్ రెడ్డి తదితరులు పాలుపంచుకున్నారు.

సుధీర్ కష్టపడ్డాడు. అదృష్టం కూడా కలిసి వచ్చింది. సుధీర్ ఈ సినిమాలో ఎంతో సహజంగా, సిన్సియర్‌గా యాక్ట్ చేశారని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమాలో మంచి థ్రిల్ ఉంది. అందుకే సినిమా అద్భుతంగా ఆడుతోందని ఆయన అన్నారు. సుధీర్ ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని, సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని ఆయన తెలిపారు.

ఇక తన సినిమా విజయంపై సుడిగాలి సుధీర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘గాలోడు సినిమాకు పెట్టిన ప్రతీ రూపాయి వెనక్కి వచ్చాకే సక్సెస్ మీట్ పెడదామని అన్నాను. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని సుధీర్ అన్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరిది ఈ విజయం. ఇన్ని థియేటర్లో నా సినిమా రిలీజ్ అవుతందని నేను అనుకోలేదని దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ తాను రుణపడి ఉంటానని సుధీర్ తెలిపారు. నేను అభిమానులు అని అనను. నా ఫ్యామిలీ అంటాను ఈ విజయం ప్రతీ ఒక్కరిదీ. ఎందుకంటే ప్రతి ఇంట్లో వారు నన్ను కొడుకులా చూశారు. ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి పాదాభివందనం. జీవితాంతం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మాస్ లుక్‎లో చిరంజీవి.. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ రిలీజ్

Exit mobile version