Site icon Prime9

Sonu Sood: తరువాత వారి పరిస్థితి ఏంటి.. ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన సోనుసూద్

Sonu sood

Sonu sood

Sonu Sood: దేశ చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదంగా ఒడిసాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటన మిగిలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికే 290కి పైగా మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇంకా మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం. కాగా ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రైలు ప్రమాదంపై యావత్ దేశప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు సైతం ఈ దుర్ఘటనపై స్పందిస్తున్నారు. పలువురు ఈ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

అయితే కరోనా సమయంలో నటుడుగానే కాకుండా సమాజ సేవకుడిగానూ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలతో సోనూసూద్ పేరు ప్రఖ్యాతలు గడించారు. కాగా తాజాగా ఒడిసా రైలు ప్రమాదంపై సోనుసూద్ స్పందిస్తూ సంచలన ఓ వీడియో ట్వీట్ చేశాడు.

నెక్ట్స్ వారి పరిస్థితేంటి(Sonu Sood)

అందులో “మనం ఈ రోజు ప్రమాదం జరిగిందాని గురించి తెలుసుకొని ట్వీట్ చేస్తాం. బాధితుల పట్ల సానుభూతి చూపిస్తాం. కానీ వెంటనే మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. ఆ తర్వాత ఈ ప్రమాదం గురించి కానీ నష్టపోయిన గురించి కానీ ఎవరూ పట్టించుకోరు. అయితే వీరిలో జీవనోపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు ఎంతో నష్టపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడతాయా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్టపరిహారం రెండు మూడు నెలల్లోనే అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదంలో తమ కుటుంబాన్ని పోషించే వారి కాళ్ళు, చేతులు తెగిపోయాయి. కొంత మంది ప్రాణాలే విడిచారు. మరి అలాంటి వారికి ప్రభుత్వాలు ఇచ్చే నష్టపరిహారంతో న్యాయం జరుగుతుందా? ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏదో నష్టపరిహారం చెల్లించి వదిలేయకుండా వారికి పెన్షన్స్ కానీ, స్థిరాదాయం కల్పించడం కానీ చేయాలి. అలా చేస్తేనే వారికి మనం భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం” అంటూ ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఒడిశాలో జరిగిన విషాదం గురించి తెలియగానే నా గుండె ముక్కలైంది. ప్రమాద బాధితులకు సానుభూతి తెలుపుతున్నాను. మనందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వీడియోకు కింద రాసుకొచ్చారు. దీనితో సోనూసూద్ చేసిన ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. సోనూసూద్ ఆలోచన కరెక్టే కదా అంటూ నెటిజన్లు ఒకింత ఆలోచనలో మునిగిపోయారు. ప్రభుత్వాలు సోనూసూద్ ఇచ్చిన సలహా ప్రకారం ఆలోచన చేస్తే బాగుంటుందంటున్నారు.

Exit mobile version