Site icon Prime9

Sky movie: ఒంటరి తనం ఒక మనిషికి ఏమి నేర్పిస్తుందనేది ఈ సినిమా కాన్సెప్ట్!

sky movie prime9news

sky movie prime9news

Tollywood: చివరి దశలో స్కై సినిమా. సీనియర్ నటుడు ఆనంద్, మురళీ కృష్ణం రాజు, మెహబూబ్ షేక్, రాకేశ్ మాస్టర్ ముఖ్య మైన పాత్రల్లో నటిస్తున్న సినిమా ” స్కై “. ఈ సినిమాకు పృధ్వీ పేరిచర్ల దర్శకత్వం వహించగా, నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణం రాజు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రసూల్ పని చేస్తున్నారు. ఈ సినిమాకు శివ స్వరాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశలో ఉంది.

ఈ సినిమా గురించి డైరెక్టర్ పృధ్వీ పేరిచర్ల మాట్లాడుతూ “ఒక మనిషి ఒంటరిగా బ్రతకాలిసి వస్తే, అతను అనుభవిస్తున్న బాధను, సంతోషంగా తన ఒంటరి తనాన్ని జయిస్తాడా లేక ఒంటరి జీవితం గడవడం కోసం పక్క వారిని మోసం చేస్తాడా ? ఒంటరి తనం ఒక మనిషికి ఏమి నేరిపిస్తుంది? ఒక మనిషిగా ఎలా మలుస్తుంది అనేది ఈ కథ అని తన మాటల్లో చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా చివరి దశలో ఉందని, కీలక సన్నివేశాలు షూటింగ్ జరుగుతుందని, తెలుగువారంతా గర్వపడే విధంగా ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగిరెడ్డి గుంటక తన మాటల్లో తెలిపారు.

Exit mobile version