Site icon Prime9

Shiva Rajkumar: ’జైలర్‘ చిత్రంలో శివరాజ్ కుమార్

Jailer

Jailer

Tollywood: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శాండల్ వుడ్ అగ్రనటుడు శివరాజ్ కుమార్ కూడ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ శివ రాజ్‌కుమార్ చిత్రాన్ని షేర్ చేసి: #జైలర్ సెట్స్ నుండి డాక్టర్ శివ రాజ్‌కుమార్ అంటూ పేర్కొంది.

ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా కన్నడ పరిశ్రమలో అగ్రస్దానంలో కొనసాగుతున్న శివరాజ్ కుమార్ ఇతర బాషా చిత్రాల్లో పెద్దగా నటించలేదు. కానీ ఇపుడు తమిళ చిత్రంలో అదీ రజనీకాంత్ సినిమాలో నటించడం విశేషం. జైలర్ చిత్రంలో వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్ మరియు వినాయకన్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్‌ని ఈ ఏడాది ఫిబ్రవరిలో తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించినా తర్వాత అది జైలర్‌గా మార్చారు.

 

Exit mobile version