Site icon Prime9

Samantha-Viswaksen: సమంత “శాకుంతలం”, విశ్వక్ సేన్ “ధమ్కీ” సినిమాలు రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?

samantha vishwaksen

samantha vishwaksen

Samantha-Viswaksen:  తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

మన చిత్రాలు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ లను అందుకుంటున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలు వరుసగా రిలీజ్ వాయిదా వేసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

సమంత నటిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం”. ఈ మూవీ కోసం సామ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో నుంచి స్ఫూర్తి పొంది గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సమంత కెరీర్ లో ఇది తప్పకుండా ఒక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ చిత్రం ఫిబ్రవరి లోనే రిలీజ్ కావాల్సింది. ఇటీవల ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.

తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంది.

కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

శాకుంతలం చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయలేకున్నాం. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నందుకు చింతిస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

ధమ్కీ పరిస్థితి కూడా అంతే..

మరోవైపు యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ధమ్కీ.

పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది.

ఇందులో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.

శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసారు.

దీంతో ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే ఎక్కువగా హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయట్లేదంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వెల్లడించారు తెలిపింది చిత్రయూనిట్.

మూవీ వాయిదా పడటానికి కారణం..ఇందులో డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఈ సినిమాని వన్మయే క్రియేషన్స్ నిర్మిస్తుడంగా.. రావు రమేష్, రోహిణి, అజయ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version