Prime9

Shaakuntalam: ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన సమంత.. ‘శాకుంతలం’ రిలీజ్ డేట్

Shaakuntalam: ఇటీవల యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో సమంత అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కాగా కొద్దిరోజులుగా సామ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. యశోద చిత్రం కంటే ముందు సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన చిత్రం శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ఇకపోతే ఈ రోజు శాకుంతలం చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్టేడ్ ను షేర్ చేశారు చిత్ర బృందం. శాకుంతలం మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో సమంతతోపాటు దేవ్ మోహన్ కూడా ఉన్నారు. ఇందులో సామ్ శకుంతల టైటిల్ రోల్లో నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ గతేడాది విడుదల కావాల్సి ఉండగా 3డీ వెర్షన్ కోసం ఈ సినిమాలో జాప్యం జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

samantha shaakuntalam movie release date fix

 shaakuntalam movie release date fix

ఇకపోతే ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి మూవీలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు నెట్టింట తన అభిమానులను పలకరిస్తూ ఉంటున్నారు.

సామ్ శాకుంతలంతో పాటు బాక్సాఫీస్ వద్ద మరికొన్ని చిత్రాలు ఫిబ్రవరి 17న సందడి చేయబోతున్నాయి. తమిళ స్టార్ ధనుష్ నటిస్తోన్న సర్ చిత్రం.. విశ్వక్ సేన్ ధమ్కీ , కిరణ్ అబ్బవరం వినరో భాగ్యం విష్ణు కథ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. మరి ఈ ఏ సినిమాను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారో వేచి చూడాలి.

Exit mobile version
Skip to toolbar