Site icon Prime9

Samantha Naga Chaitanya: నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో కలిసిపోతారట..!

samantha-and naga-chaitanya-to-work-together-after-divorce

samantha-and naga-chaitanya-to-work-together-after-divorce

Samantha Naga Chaitanya: నాగచైతన్య సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వీరిద్దరూ త్వరలో కలవనున్నారంటా.. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరున్న సమంత-నాగచైతన్యలు గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కపుల్ చేసిన ప్రకటన కేవలం దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా గతేడాది హాట్‌ టాపిక్‌ అయింది. ఎన్నో ఏళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుని పట్టుమని నాలుగేళ్ల పూర్తవకుండానే విడిపోవడంతో అటు ప్రేక్షకులు, ఇటు సినీ సెలబ్రెటీలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్తున్నట్టు పోస్టులు పెట్టారు. ఇక అప్పటి నుంచి జంటగా ఎక్కడా వీరు కనిపించలేదు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ స్నేహితులుగానే ఉంటామని సినిమాల్లో కూడా నటిస్తామని చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పారు.

ఇక ఇటీవలే సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ప్రేక్షకులంతా చైతన్య సమంతను దగ్గరు తీసుకుంటే బాగుంటూ అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనే త్వరలోనే నాగార్జున, నాగచైతన్య.. సమంతను కలువబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య కలిసి ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ‘ఏమాయ చేశావే’ సినిమాతో వీరిద్దరూ మొదటి సారి కలిసి నటించారు. ఈ చిత్రం తర్వాత ‘మనం’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మజిలీ’ వంటి చిత్రాల్లో నటించారు. కాగా ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే విడాకుల తర్వాత వీరిద్ధరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదీ చదవండి: ఎన్టీఆర్ నయా లుక్.. సూపర్ ట్రెండీ గురూ..!

Exit mobile version