Site icon Prime9

Samantha: “ఇదే సరైన సమయమంటున్న” సమంత.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

actress-samantha-new-year-2023-post on Instagram-goes-viral

actress-samantha-new-year-2023-post on Instagram-goes-viral

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత.. అటు సౌత్ లోనే కాకుండా.. ఇటు నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల యశోద సినిమాతో హిట్ అందుకున్నారు. కాగా ఆమె కొద్ది రోజులుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దానితో సామ్ షూటింగ్స్‏కు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ అప్పుడప్పుడూ తన అభిమానులను నెట్టింట పలకరిస్తూ ఉంటారు. లేడీ ఓరియెంటెడ్ సరోగసి నేపథ్యంలో వచ్చిన యశోద మూవీలో సామ్ నటనకు ప్రశంసలు అందుకుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో తెరకెక్కగా ఇందులో సామ్ నటన విమర్శకులైను సైతం ఎంతగానో మెప్పించింది. కాగా మయోసైటిట్ వ్యాధి నుంచి సామ్ తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇకపోతే యశోద సినిమా తర్వాత సోషల్ మీడియాలో చాలా సైలెంట్ అపోయిన సమంత.. గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుందని పలువురు చెప్తూ వచ్చారు. అయితే తాజాగా సామ్ మరోసారి నెట్టింట అభిమానులను పలకరించింది. తను ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. న్యూఇయర్ సందర్భంగా తన అభిమానులకు విషెస్ చెబుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది. “మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి. అలాగే కొత్త, సులభమైన లక్ష్యాల కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం.
మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్ధేశించుకోండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023” అంటూ స్మైల్ చేస్తున్న తన ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలగా మారింది. ఆమెకు పలువురు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు నెటిజన్లు మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha post viral

ప్రస్తుతం సామ్ నటిస్తోన్న తాజా చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సామ్ నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ కీ రోల్ పోషిస్తున్న శాకుంతలం మూవీ కూడా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. షూటింగ్ కు దూరంగా ఉంటున్నారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ప్రభాస్ మేడమ్ ఎవరు? సనన్ ఆ .. శెట్టినా ?? రామ్ చరణ్ ఏం అన్నాడంటే ?

Exit mobile version