Site icon Prime9

Tollywood: డబుల్ మీనింగ్ డైలాగులతో తమ్ముడిని ఆటపట్టించిన సాయి ధరమ్ తేజ్

saidharam tej

Tollywood: హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎప్పుడు తక్కువ మాట్లాడే సాయి ధరమ్ తేజ ఈసారి తన ట్రెండును మార్చేశాడు. తన ముద్దుల తమ్ముడు గురించి మాట్లాడుతూ తేజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడు స్టేజ్ ఎక్కి రెండు మాటలు మాట్లాడి కిందకు వెళ్లి పోయే వాడు. కానీ ఈసారి తన తమ్ముడు కోసం ఒక మెట్టు ఎక్కి నా తమ్ముడు గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారని మైక్ పట్టుకొని చాలా సేపు మాట్లాడాడు. దీనితో ఇతను నిజంగా మన సుప్రీం హీరోనేనా అంటూ అభిమానులందరు షాక్ అవుతున్నారు.

సాధారణంగా హీరోయిన్స్ గురించి చాలా తక్కువ మాట్లాడే సాయి ధరమ్ తేజ్, కానీ ఇప్పుడు కిక్ వచ్చేలా మాట్లాడాడు. తన తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ వైపు చూస్తూ ‘ఏరా వైష్ణవ్, కేతికతో అంత నువ్వు బాగా క్లోజ్ అంటగా అని అడగగా, వైష్ణవ్ తల ఊపడంతో అభిమానులందరు ఆ మాటకు షాక్ అయ్యి తేజ్ పంచ్ బాగా వేశారంటూ స్టేజ్ మొత్తం వినపడేలా గట్టిగా అరిచారు. అప్పుడు వెంటనే వైష్ణవ్ మైక్ తీసుకొని ఏంట్రా పంచ్ అని అన్నాడు. అరేయ్ నేనోదే మా తమ్ముడిని జోక్ గా ఏడిపిస్తున్నాను, మీరేందుకు అరుస్తున్నారంటూ సాయి ధరమ్ తేజ్ మైక్ తీసుకొని చెప్పాడు.

ఎప్పుడు సైలెంటుగా ఉండే సాయి ధరమ్ తేజ్ ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్లో మాత్రం కాస్తా ఎక్కువే మాట్లాడి హాట్ టాపిక్ గా నిలిచాడు. మొత్తం ఫంక్షన్లలో ఈ హీరో కొత్త స్టైల్లో కనిపించి అందరని షాక్ కు గురి చేసాడు.

Exit mobile version