Site icon Prime9

Singer Sunitha : నటిగా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ సునీత

rumours about singer sunitha going to act in mahesh babu movie

rumours about singer sunitha going to act in mahesh babu movie

Singer Sunitha : తెలుగు సినీ పరిశ్రమలో గాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ” సునీత “. తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో వందల పాటలతో పాటు చాలా మంది హీరోయిన్స్ కు గాత్రదానం కూడా చేశారు సునీత. కెరీర్‌లో ఏకంగా 120 మందికి పైగా హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్‌ చెప్పిన ఘనత సునీత సొంతం. తెలుగు లోనే కాకుండా పలు భాషల్లో పాటలు పాడి శ్రోతలను అలరించారు. అలానే జెమిని టివిలో నవరాగం, ఈ టివిలో ఝుమ్మంది నాదం, సప్తస్వరాలు, పాడుతా తీయగా, జీ సరిగమ లాంటి వివిధ కార్యక్రమాలకు జడ్జ్ గా కూడా చేశారు.

ఇక 2020 లో ఆమె ప్రముఖ వ్యాపారవేత్త అయిన మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనినితో పెళ్లి చేసుకుంది. రెండో వివాహం పై ఎన్నో విమర్శలకు, ట్రోలింగ్ లను ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో సునీత సోషల్ మీడియా లోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సునీతకు సంబంధించిన వార్త ఒకటి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అందం విషయంలో హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉండే సునీత ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించలేదు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్ కుటుంబ సభ్యులు వరుసగా కన్నుమూయడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా లోనే సునీత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. చూడాలి మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Exit mobile version
Skip to toolbar