Site icon Prime9

Ram Charan: రామ్ చరణ్ భార్యగా అంజలి

RC15

RC15

Tollywood: శంకర్ దర్శకత్వం వహిస్తున్న రామ్ చరణ్ రాబోయే చిత్రంలో నటి అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ రోజు అంజలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో #RC15 షూటింగ్‌లో పాల్గొనడానికి తూర్పుగోదావరిలోని రంపచోడవరం వెళుతున్నట్లు పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో అంజలి సీనియర్ రామ్ చరణ్ భార్యగా, ప్రస్తుత రామ్ చరణ్ తల్లిగా కనిపించనుందని తెలుస్తోంది. సెట్ నుండి లీక్ అయిన కొన్ని చిత్రాలు చరణ్ మరియు అంజలిని కొన్ని స్టిల్స్ లో చూపించాయి. రామచరణ్ పంచె ధరించి మీసాలతో, అంజలి ఎరుపు కాటన్ చీరలో కనిపించారు. ఇంతకుముందు మొదట రాజమండ్రి సమీపంలో ఈ చిత్రం షూటింగ్ అయినపుడు ఫోటోలు లీక్ అయినప్పటికీ, #RC15 బృందం మళ్లీ అక్కడ షూటింగ్ చేస్తున్నందున అవి ఇప్పుడు బయటకు వచ్చాయి.

సాధారణంగా శంకర్ చిత్రాలకు బలమైన ఫ్లాష్‌బ్యాక్‌లు ఉంటాయి. ఈచిత్రంలో కూడ అవి రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. చరణ్ ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. #RC15 చిత్రం అంజలి కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

Exit mobile version