Site icon Prime9

Raviteja – Gopichand Malineni: గోపించంద్ మలినేని, రవితేజ సూపర్ హిట్ కాంబో రిపీట్

ravi teja gopichand malineni

ravi teja gopichand malineni

Raviteja-Gopichand Malineni: గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ అంటే చాలు మాస్ మోత మోగిపోవాలి. ఈ సూపర్ హిట్ కాంబోలో మూవీ వస్తుందంటే చాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఖాయమనే చెప్పాలి. థియేటర్లలో మాస్ మహారాజ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఈలలు గోలల మోతతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. 2021లో వచ్చిన క్రాక్ సినిమా గోపీచంద్ అండ్ రవితేజ కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాకి ముందు ఈ ఇద్దరు ప్లాప్ లతో సతమతవుతున్న వేళ క్రాక్ సినిమా వీరిద్దరి కెరీర్ కు ఓ స్పెషల్ ఫిలింగా నిలిచిపోయింది. అప్పట్నుంచి క్రాక్ కి సీక్వెల్ వస్తుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

కాగా ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ గోపీచంద్ కూడా గతంలో క్రాక్ 2 సినిమా ఉంటుందని ప్రకటించాడు. దీనితో మాస్ మహారాజ అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా క్రాక్ 2 కోసం సినిమా కోసం ఎంతో ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో మరో సినిమాని ప్రకటించారు. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని.. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రవితేజ సినిమా ఉండబోతుందని నేడు అధికారికంగా ప్రకటించారు. దీనితో రవితేజ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

వీరిద్దరి కాంబోలో ఇది నాలుగో సినిమా. అయితే ఇది క్రాక్ 2 నా? కాదా అనేది ఇంకా వెల్లడించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది క్రాక్ 2 అనే భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ అనౌన్స్ పోస్టర్ చూస్తుంటే ఇది కూడా పవర్ ఫుల్ మాస్ స్టోరీగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version