Site icon Prime9

Ravi Teja: సుధీర్ వర్మతో మరోసారి జతకడుతున్న మాస్ మహారాజ

raviteja-sudheer-varma

Tollywood: మాస్ మహారాజ రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసురుడు సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుధీర్ వర్మ వర్కింగ్ స్టైల్‌తో ఇంప్రెస్ అయిన రవితేజ అతనికి దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చాడు.

రవితేజ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత వీరిద్దరూ వచ్చే ఏడాది మరోసారి కలిసి పని చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్ట్‌ను ఓకే చేసారు. దీనిపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. అదే ప్రొడక్షన్‌ హౌస్‌ నిర్మిస్తున్న ధమాకా షూటింగ్‌ను రవితేజ పూర్తి చేశారు.

ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది షూటింగ్ పూర్తవుతుంది. సుధీర్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని, శ్రీవాస్‌లకు రవితేజ ఓకే చెప్పాడు. ఈ మూడు ప్రాజెక్టుల షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

Exit mobile version