Site icon Prime9

Ram Charan: ’హీరో ‘ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

Tollywood: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్-టు-బ్యాక్ టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా పుష్ప క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రకటనలకు రెడీ అవుతున్నాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం హీరో గ్లామర్ బైక్ కమర్షియల్ షూటింగ్ లో ఉన్నాడు. ఈ బైక్‌ల బ్రాండ్ అంబాసిడర్‌గా ఏడాదిన్నర పాటు వ్యవహరిస్తారడని సమాచారం. రామ్ చరణ్ యాడ్ 30 సెకన్లపాటు ఉంటుందని తెలుస్తోంది. గతంలో అతను డొకోమో మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా, బట్టల బ్రాండ్ గా వ్యవహరించాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ కధలు వింటున్నాడు. తన తుదుపరి ప్రాజెక్టు ఏమిటన్నదానిపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశముంది.

Exit mobile version